Spiritual

9న పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయనగరం,ఐఏషియ న్యూస్: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ఈనెల 9వ తేదీన ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మెన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతులమీదుగా ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా, అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. …

Read More »

అంగరంగ వైభవంగా సిరిమాను సంబరం

పట్టణ పురవీధుల్లో ముమ్మారు ఊరేగిన పైడితల్లమ్మ పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా ముగిసిన జాతర విజయనగరం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది జనం జేజేలు పలుకుతుండగా, బెస్తవారి వల, అంజలి రథం, పాలధార, తెల్ల ఏనుగు ముందు నడవగా అమ్మవారు సిరిమాను రూపంలో మూడుసార్లు కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఆశేష భక్త జనావళిని ఆశీర్వదించారు. ఈ వేడుకను భక్తజనం కనులారా తిలకించి పులకించారు. సంప్రదాయబద్దంగా సిరిమాను పూజారి బంటుపల్లి …

Read More »

శబరిమల అయ్యప్ప ఆలయం 17 నుంచి 22 వరకు తెరిచి ఉంటుంది

శబరిమల,ఐఏషియ న్యూస్:  శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తులం మాస పూజల కోసం ఈనెల 17- 22 వరకు తెరవనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపింది. దర్శనం కోసం వర్చ్యువల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.ఇదే సమయంలో గర్భగుడి ముందున్న …

Read More »

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు వరుడి తరఫు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుక చేశారు. డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దదిపశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా ఆయనది కమ్మ …

Read More »

శ్రీమహాలక్ష్మి అలంకరణలో కన్యకాపరమేశ్వరి భక్తులకు దర్శనం

7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు: 12 కేజీల ల వెండి వస్తువులు బిస్కెట్లు 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ 250 మంది మహిళలచే కోటికుంకుమార్చన (వి వి ఆర్ ఎస్ ఆదిత్య) విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ ఓల్డ్ టౌన్ లో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 148 సంవత్సరాల పురాతన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం నాడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కలిగించినట్లు దేవస్థాన సంఘ …

Read More »

ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం

ఒంటిమిట్ట,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం సమీపంలోఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు కానుంది.ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు.త్వరలోనే ఈ విగ్రహం రూపుదిద్దుకోనున్నది. Authored by: Vaddadi udayakumar

Read More »

శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం పట్టణంలో అక్టోబరు 6, 7 తేదీల్లో జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి తోలెళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి,, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంకు చేరుకొని, ముందుగా అమ్మవారిని దర్శించుకొని, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేయుచున్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం, ఆలయం పరిసర …

Read More »

విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి చాన్విక జ్యోతిన్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. దుర్గగుడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై విపక్ష వైసీపీ నేతలు, కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తోసిపుచ్చి.. “విజయవాడ ఉత్సవ్‌”ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా మొదట హైకోర్టు సింగిల్ బెంచ్, ఆలయ భూముల్లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని …

Read More »

భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దుర్గా నవరాత్రి ఉత్సవాలు

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:   దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాలు పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వస్తున్నారు. ప్రతీ ప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. విజయవాడలో బాలత్రిపురసుందరి దర్శనం అలంపురి శక్తిపీఠాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తొలిరోజు అమ్మవారు బాలత్రిపురసుందరిగా దర్శనమిస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులనుదర్శనానికి అనుమతించారు. మంగళవారం నుండి ఉదయం 4 …

Read More »

సీనియర్ సిటిజన్,దివ్యాంగ భక్తులకోసం రెండు వీల్ చైర్స్ వితరణ చేసిన న్యాయవాది రహీమున్నీసా

సింహాచలం,,ఐఏషియ న్యూస్: సింహాచలం దేవస్థానానికి వచ్చే సీనియర్ సిటిజన్, దివ్యాంగ భక్తుల కోసం విశాఖ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రహీమున్నీసా తన తండ్రి షేక్ ఖాదర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆలయ అధికారి సునీల్ కు రెండు వీల్ చైర్స్ అందజేశారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రహీమున్నీసా తెలియజేశారు.అనంతరం సింహాద్రి నాధుని దర్శించుకున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »