Spiritual

ముంబైలోని గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా

ముంబై,ఐఏషియ న్యూస్:  గణేష్ వేడుకల్లో భాగంగా,దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వివిధ ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన గణేశమూర్తులు, భారీ సెట్టింగులతో తాత్కాలిక మండపాలు రెఢీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించినట్టు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.ముంబై మహానగరంలోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి …

Read More »

సామాజిక సేవలో సిఎల్సి చర్చి

విద్యార్థులకు గ్లాసులు,మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ బుచ్చయ్యపేట,,ఐఏషియ న్యూస్: అమెరికా దేశీయుల సహకారంతో, గాజువాక సిఎల్సి చర్చి అధినేత సుధీర్ కే మహంతి ఆధ్వర్యంలో బుధవారం బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, కంచాలు పంపిణీ చేయడంతో పాటు, ఎల్బీపురం, బంగారు మెట్టల మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే త్రాగునీటి బోర్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మహంతి అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి. అమెరికాలోపుట్టి,భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సేవా …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »

వైభవోపేతంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతికి కదలివచ్చిన అష్టలక్ష్మిలు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలతో వరలక్ష్మీ మండపాలంకారం తిరుపతి,ఐఏషియ న్యూస్: శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం నాడు తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారికి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు.ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారు ఆశీనులైన బంగారు రథానికి దారి పొడవునా హారతులు పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. నాలుగు …

Read More »

8న వరలక్ష్మి వ్రతం

స్పెషల్ డస్క్,ఐఏషియ న్యూస్: శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మివ్రతాన్నిఅత్యంతభక్తిశ్రద్ధలతోజరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం,ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం .వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు …

Read More »

నేడు దామోదర ద్వాదశి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి సాల గ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి అలాంటి సాలగ్రామాలు గండకీ నది’ లో విరివిగా లభిస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయ డానికి అందుబాటులో వుంటాయి ఎంతో విశిష్టతను సంతరించుకున్న …

Read More »

సింహాచలంలో “లడ్డు ప్రసాదం” తయారీ డెమో

దేవాలయాల్లో ఒకే ప్రామాణికత లక్ష్యంగా నిర్వహణ సింహాచలం ఈవో త్రినాధరావు వెల్లడి సింహాచలం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ గొల్లపూడి విజయవాడ వారి ఆదేశాల మేరకు,రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో లడ్డు ప్రసాదాన్ని ఒకే ప్రామాణికతతో తయారు చేయడం కోసం ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు సమక్షంలో స్వామివారి ప్రసాదం తయారీ డెమో జరిగింది. డేమోలో ఉపయోగించిన దిట్టం: సెనగపిండి: 10 కిలోలు,పంచదార: 20 కిలోలు నెయ్యి: 6 కిలోలు,    జీడిపప్పు: 00:750 గ్రాములు,కిస్మిస్: 00:500 గ్రాములు,ఇలాచి పొడి: 00:75 గ్రాములు,  …

Read More »

తిరుచానూరులో “వరలక్ష్మీ వ్రతానికి” విస్తృత ఏర్పాట్లు

టీటీడీ ఆలయాల్లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం తిరుచానూరు,ఐఏషియ న్యూస్: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 8వ తేది వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ …

Read More »

తిరుమల అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు

తిరుమల,ఐఏషియన్యూస్: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టిటిడి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యత,రుచిని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఈవో టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.భక్తులు టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.అంతకుముందు ఈవో,అదనపు ఈవోతో కలసి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.తరువాత కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం అందించారు.అనంతరం …

Read More »

సింహాద్రినాధుని సన్నిధిలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

సింహాచలం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని గుజరాత్ హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన జడ్జికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు ఆదేశాల మేరకు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పి ఆర్ ఓ నాయుడు నాదస్వర, వేదమంత్రాల మధ్య స్వామివారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు.ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ ఆ తర్వాత బేడా మండపంలో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం, వేదపండితులు …

Read More »