అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి తీరు పైన మంత్రివర్గ భేటీలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేనని నిర్దేశించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. సమావేశాల సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో వారి తీరు పైన సీరియస్ అయిన సీఎం.. తాజాగా మంత్రివర్గ భేటీలో అధికారిక అజెండా తరువాత మరోసారి ఈ ప్రస్తావన చేసారు. ఈ సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల పైన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar