హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కమ్యూనిస్టు ఉద్యమానికి అపారమైన సేవలందించిన సీపీఐ జాతీయ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి గురువారం రాత్రి నుంచి విషమించగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సురవరం
మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాలలో అడుగుపెట్టి, అనంతరం పార్టీకి కట్టుబడి నిరంతర శ్రమ చేశారు. తన క్రమశిక్షణ, అచంచలమైన ఇదినిర్వహణ సుధాకర్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
1998, 2004లో రెండు సార్లు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ రైతులు, కూలీలు, సాధారణ ప్రజల సమస్యలపై గళమెత్తారు. వివిధ కమిటీలలో పనిచేసి, విద్య, వ్యవసాయం, పరిశ్రమల సమస్యలపై లోతైన చర్చలు జరిపారు. సురవరం ఆకస్మిక మృతి పట్ల పలువురు సిపిఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Authored by: Vaddadi udayakumar