హైదరాబాద్,ఐఏషియ న్యూస్: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 82 ఏళ్ల వ్యక్తికి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది.నిందితులు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని, మనీలాండరింగ్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందని వయోధికుడిని బెదిరించారు.
పదిరోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశామని బాధితుడిని వేధించి రూ.72 లక్షలు వసూలు చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి కాల్స్ ఎవరు అటెండ్ చేయొద్దని ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొంటున్నారు.
Authored by: Vaddadi udayakumar