దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్

అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, పనులు చేయకుండా చేసినట్లు, దొంగ మస్తర్లతో, చనిపోయిన వారికి వేతనాలు చెల్లించి ఉపాధి హామీలో పనులలో భారీ అవకతవకలు జరిపి నిధులు గోల్ మాల్ చేసేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. నిధులు గోల్మాల్ పై అధికారులు గుర్తించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ నాయుడు బాబు గ్రామస్థులు, అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోకుండా నమా మాత్రంగా ఫైన్ లు రాసి, రికవరీ చేయకుండా తగిన శిక్షణ విధించకుండా అధికారులు వదిలేయడం గల కారణాలు తెలపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనితో అధికారులకు ఉప సర్పంచ్ నాయుడు బాబు మధ్య వాగ్వివాదం జరిగింది.మండలమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అయితే వీళ్లకి కొమ్ముకాసేది ఎవరు? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అని ప్రజలు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.

మా చెమట చుక్కల కష్టానికి ఇచ్చిన నిధులు మాకు రావాలి. వేతనాలు మా హక్కు ‘పనికి ఆహార పధకం’ మా ఆహారం అధికారులే భోజనం చేసేస్తున్నారని వారిపై కఠిన చర్య తీసుకోవాలని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ దర్యాప్తు జరిపి కూలీలకు రావలసిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఇక పై పనులు నిజంగా జరిగేలా ప్రజల సమక్షంలో పారదర్శకంగా చేయాలని ఉపాధి హామీ కార్మికులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల ప్రజావేదిక లో డ్వామా పీడీ పూర్ణిమ దేవి, విజిలెన్స్ అధికారి (డివివిఓ) కె. రవీంద్ర, మండల ప్రత్యేక అధికారి ఎస్. రాజబాబు,ఎస్ఆర్పి లు రామచంద్ర, చిరంజీవి, డిఆర్పిలు, ఏపీఓ వరహాలుబాబు, టిఏ, ఎఫ్ఏ విఆర్పి లు సిబ్బంది, సర్పంచ్ లు పెదిరెడ్ల మాణిక్యం, గోకివాడ వరకృష్ణ, ముచకర్ల అప్పారావు, ఎంపీటీసీ డి. అప్పారావు, నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమెరికా స్కూల్‌ లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్‌ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *