లంచం తీసుకున్న ఎస్ఐ కి ఏడేళ్ల జైలుశిక్ష,2.5 లక్షల జరిమానా

ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకటన

లీగల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. వివరాల్లోకెళ్తే విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు,అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్ ఐ గా పనిచేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో మంగరాజు,అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్ ఐ తాత్సారం చేశారు.అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఇలాంటిని తీసుకున్న కేసులో ఎస్ఐ కు శిక్ష పడింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు

తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు నివేదిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *