బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: వెండి నగలు కొంటున్నారా అయితే ఈ కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి 900, 800, 835, 925, 970, 990 స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది.
హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు. హాల్మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు ఆరు అంకెల హెచ్ యు ఐ డి అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ దాని ప్రామాణికత,స్వచ్ఛతను సూచిస్తుంది. ఇక కల్తీ లేకుండా స్వచ్ఛమైన వెండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
Authored by: Vaddadi udayakumar