బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Authored by: Vaddadi udayakumar