బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతదేశంలోని అగ్రశ్రేణి అల్యూమినియం తయారీదారు హిందాల్కో ఇండస్ట్రీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఒక భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రెడీ అయింది. సంస్థ సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సౌకర్యం ను ఏర్పాటు చేయనుంది.ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఆమోదం కోసం గురువారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే ఇది నేరుగా ఆపిల్ గ్లోబల్ సరఫరా గొలుసుతో రాష్ట్రాన్ని అనుసంధానిస్తుంది.ఈ కుప్పంలో ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నియోజకవర్గం.అలాగే కుప్పం భౌగోళికంగా ఒక వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. బెంగళూరు నుండి కేవలం 120 కి.మీ దూరంలో ఉండటం ప్లస్ పాయింట్. అలాగే చెన్నై నుండి కేవలం 200 కి.మీ. దూరంలో ఉండటం వలన, రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Authored by: Vaddadi udayakumar