టెక్కలి 108 లో గిరిజన మహిళ సుఖప్రసవం
టెక్కలి(శ్రీకాకుళం),ఐఏషియ న్యూస్: మందస మండలం బంసుగాం గిరిజన గ్రామానికి చెందిన సవర రుక్మిణి మొదటి కాన్పు పుట్టినొప్పులతో శుక్రవారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి అర్ధరాత్రి టెక్కలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ ప్రసవంకి సహకరించక పోవడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశారు. టెక్కలి 108 లో రిమ్స్ కి తీసుకువెళ్తుండగా కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడం తో 108 ఈ.యం.టి దేవాది శ్రీనివాస రావు, పైలట్ మూగి దుర్గారావు ప్రసవం చేయగా శనివారం ఉదయం 2:30 కి పండంటి పాపను జన్మ నిచ్చింది, ప్రసవ సమయం లో శిశువు మెడ చుట్టూ నాభిరజ్జువు చుట్టుకొని ఉండడం తో జాగ్రత్తగా ప్రసవం చేయగ శిశువు చలనం లేకుండా జన్మించింది.వెంటనే సీ.పీ.ఆర్ చేయడంతో బేబీ ఏడుస్తూ కదిలినట్లు ఈయంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఇద్దర్నీ క్షేమంగా కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలియజేశారు. గర్భిణీ కుటుంబ సభ్యులు, బంధువులు 108 సిబ్బందిని అభినందించారు.
Authored by: Vaddadi udayakumar