విశాఖ క్రైమ్ ,ఐఏషియ న్యూస్: విశాఖ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖ జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో జి ఆర్ పి,ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి , జూలీ కర్మాకర్, వారి సిబ్బందితో కలిసి గురువారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా గంజాం జిల్లా, ఒడిస్సా రాష్ట్రం కు చెందిన మాలతి సాహు, (56) సుమిత సాహూ, (35) విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయిని ముంబై, మహారాష్ట్ర రాష్ట్రంకు అక్రమముగా రవాణా చేయుచుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 95వేలు విలువగల 19 కేజీల గంజాయిని సీజ్ చేసి,సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు తెలియజేశారు.అలాగే సదరు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో విశాఖ గవర్నమెంట్ రైల్వే పోలీస్, ఆర్పీఫ్ ఫోర్స్ వారు ప్రత్యేక టీం ల సహాయంతో నిఘా వర్గాలను ఏర్పా టు చేసి, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి,సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు ముమ్మరముగా చేస్తున్నట్లు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar