గాజువాక,ఐఏషియ న్యూస్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, గాజువాక అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో దాడులు చేసి ఒక డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో సోమవారం నిర్వహించిన దాడుల్లో 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లు(750ఎంఎల్ పరిమాణం) స్వాధీనం చేసుకున్నారు. బాటిల్స్ నిల్వచేసిన శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన శరగడం దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం రిమాండుకు తరలించడం జరిగింది.ఈ దాడుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ -ఇన్స్పెక్టర్లు కె. నరసింహమూర్తి, ఈ.రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar