బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్
విజయనగరం,ఐఏషియ న్యూస్: గురజాడ స్ఫూర్తి ని ప్రజల్లోకి తీసుకు వెళతాం పాత్రి కేయుల సమావేశంలో భోగస్ ఓట్ల విషయంలో రాహుల్ గాంధీచేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి లేదంటే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. సోమవారం అయినా విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోగస్ ఓట్లు గురించి ఎన్నికల అధికారులకు మాత్రం రాహుల్ సమాధానం చెప్పడం లేదని,ఎన్నికల సమయంలో హడావిడిగా లేని విషయాన్ని ఉన్నట్లుగా చూపించడానికి రాహుల్ ప్రయత్నం చేయడం ప్రజలకు అర్థంఅవుతుందన్నారు. కడప జిల్లాతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం పార్టీ బలపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళతాం.శాస్త్రీయ పద్ధతిలో పార్టీ విజయనగరం ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలుండేవని రాజాం నెల్లిమర్ల ప్రాంతాలలో పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ చార్జీల కారణంగా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు నష్టాలపాలయ్యాయి. ఫెర్రో పరిశ్రమలు పునః ప్రారంభ మయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకు వెళతాం అమెరికా టారిఫ్ విధానం వల్ల గోదావరి జిల్లా ల్లో ఆక్వారంగం తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ దృష్టికి సమస్య తీసుకు వెళ్లాం కొత్త మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నాం విజయనగరం జిల్లాలో వ్యవసాయం ఉద్యానవన రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల్లో గానీ రాబోయే స్థానిక ఎన్నికలలో గానీ సర్దుబాటు చేసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో మంచి వాతావరణం వుంది సంచార జాతులకు హక్కులు కల్పించేలా చర్యలు కేంద్రం ఇచ్చిన రూట్ మాప్ ఫాలో అవుతాం ఈనెల 30న సంచార జాతుల సాంస్కృతిక జీవనాన్ని తెలిపే ప్రత్యేక కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికలలో జగ న్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
పలువురు విద్వాంసులకు నివాళులర్పించిన మాధవ్
విజయనగరంలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సోమవారం సాయంత్రం ప్రముఖ వయోలిన్ విద్వాంసులు డా. ద్వారం వెంకటస్వామి నాయుడు, హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఘనంగా నివాళులర్పించారు.
Authored by: Vaddadi udayakumar