గుంటూరు,ఐఏషియ న్యూస్: గుంటూరు పట్టణానికి చెందిన కటికం భారతి అను మహిళ సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వచ్చి మంగళగిరి కొత్త బస్టాండ్ దగ్గర తన పర్స్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అనంతరం కొద్దిసేపటికి ఆమె పర్సు దొరికింది. ఈ నేపథ్యంలో ఒక బాలుడు నిజాయితీగా ఆ యొక్క పర్సు తీసుకుని వచ్చి మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్ యందు సిఐని కలిసి జరిగిన వాస్తవాలు తెలియపరచగా అందులో ఫిర్యాది కటికం భారతి చెప్పిన విధంగా బంగారు చెవి జోడుజత, నాలుగు వేల ఒక వంద నగదు రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయి. అంతట సదరు బాధితురాలు తన యొక్క పర్సు పరిశీలించుకుని ఎంతో సంతోషించి సదరు కుర్రవాడికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ కె వీరాస్వామి సదరు కుర్రవాడిని అభినందించి నీలాగే అందరూ ఇదే విధంగా నిజాయితీగా ఉండాలని ప్రశంసించారు.
Authored by: Vaddadi udayakumar