ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ లు
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు, అనకాపల్లి పోలీసు వారు అందించిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం చోడవరం సబ్-జైలు సిబ్బందిపై దాడి చేసి, వారిని గాయపరిచి సబ్ జైలు నుండి తప్పించుకున్న నిందితులు నక్క రవికుమార్, బెజవాడ రాము కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యల్లో భాగంగా, విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నాలుగు పోలీసు బృందాలు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లు, వారి నివాస స్థలాలు హోటల్ లు, హాస్టల్ లలో గత రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తుండగా శనివారం ఎస్ ఐ భరత్ కుమార్, పీసీలు 3845 ఎస్.కె బక్షి, 4128 జరార్ హుస్సేన్, రాంనగర్, గొల్లలపాలెం ఏరియాలో వెతుకుచుండగా, రాంనగర్ గొల్లలపాలెం ఎస్ బి ఐ బ్యాంకు సమీపంలో సదరు అనకాపల్లి సబ్ జైలు నుండి తప్పించుకున్న ఇద్దరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎస్ సంతోష్, పిసి 1073, ఏపీఎస్పీ 16వ బెటాలియన్ అనువారు ముద్దాయిలను పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ టీం కు సహకరించినారు.
Authored by: Vaddadi udayakumar