హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాఖీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్దఎత్తున వినియోగించుకున్నారు.6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.ఈ నెల 9న రాఖీ పండుగ నాడు 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించారు.11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి.గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది రాకపోకలు సాగించారు.ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సందర్భం బట్టి భారీగా వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఏది ఏమైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరంగా మారిందని చెప్పక తప్పదు.
Authored by: Vaddadi udayakumar