విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: విశాఖనగరంలోని అక్కయ్యపాలెం, నందగిరినగర్ ప్రాంతంలో నడిరోడ్డుపై మహిళ హత్య జరిగిన ఘటన బుధవారం విశాఖ నగరం లో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసు సంబంధించి కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో మృతురాలు సంధ్యారాణి (33)గా, నిందితుడుమణికంఠ (47)గా గుర్తించారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో మణికంఠ బుధవారం కత్తితో దాడి చేసి సంధ్యారాణిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.నేరం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే 4వ టౌన్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్నారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Authored by: Vaddadi udayakumar