తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మకుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మూడో తేదీ ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Authored by: Vaddadi udayakumar