చిట్యాల (నల్లగొండ),ఐఏషియ న్యూస్: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ గుగులోతు కృష్ణ లంచం తీసుకుంటూ గురువారం తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి గట్టు రమేష్ కూడా అరెస్టయ్యారు. ఈ సంఘటనపై ఏసీబీ అధికారులు తెలియజేసిన వాళ్ళు ఈ విధంగా ఉన్నాయి మెసర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడం, అలాగే మరో వ్యవసాయ భూమి సర్వే నివేదికను చిట్యాల రక్షక భట నిలయ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించడం కోసం ఫిర్యాదుదారుని నుండి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనలో నిందితులపై ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar
Check Also
పోలీసులు అదుపులో దగ్గు మందు ఫార్మా కంపెనీ యజమాని
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో …