కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట

9 మంది భక్తులు దుర్మరణం

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతులంతా మహిళా భక్తులు. కార్తిక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలుకొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రైవేటు దేవాలయం అని దేవాదాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కేవలం రెండు నుంచి మూడు వేల వరకు భక్తులు బట్టి ఆలయంలో సుమారు 25వేల మంది ఏకాదశి సందర్భంగా ఆలయానికి చేరుకొని మృత్యువాత పడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి త్వరితగతిన తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతి చెందిన వారి వివరాలను పోలీసులు అధికారులు సేకరిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *