ఆర్థిక కేంద్రంగా “అమరావతి” ఆవిర్భావం

  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కితాబు
  • 15 జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కేంద్ర కార్యాలయాలకు శంకుస్థాపన

(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు,ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్’ ప్రధాన కార్యాలయాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం వంటిదన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని,ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదన్నారు.ఆర్థిక తోడ్పాటు అందించాలనే 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని ఒకేచోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదన్నారు. ఆర్థిక కేంద్రంగా అమరావతి ఆవిర్భావించిందని నిర్మల సీతారామన్ కితాబునిచ్చారు.భవిష్యత్తులో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రశంసించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతని రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించామన్నారు. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ వంటి వచ్చాయన్నారు చంద్రబాబు. ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరారు. ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు.మన దేశానికి కూడా మహిళా ఆర్ధిక మంత్రే ఉన్నారు.దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగిందన్నారు.ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, గతంలో విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడే గాడిన పెడుతున్నాం.ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలం అన్న విశ్వాసం తమకు ఉందన్నారు. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తాం. 2047కి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అందులో ఏపీది కీలక పాత్ర పోషిస్తుందని పునరుద్ఘాటించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అలాగే 2028 నాటికి కూడా అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయి. ఏపీకి కూటమిపై భరోసాతో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్’ అన్నారు చంద్రబాబు.ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని,కేంద్రం అండతోనే అమరావతి పునర్నిర్మాణ పనులు రూ. 1.7 లక్షల కోట్లతో ప్రారంభమయ్యాయి. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో… ప్రధాన మంత్రి గారు రూ. 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కొప్పర్తి- ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.11 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీకి కేంద్రం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి రూ. 12,500 కోట్లు, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని సమకూర్చింది. రాష్ట్రంపై ప్రత్యేక అభిమానంతో నిధులు మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ లకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రౌడీయిజం చేస్తే “రాష్ట్ర బహిష్కరణ” చేస్తా

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కొందరు రాజకీయ ముసుగులో ఉండే రాజకీయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *