21న సిబిఐ కోర్టులో హాజరుకానున్న మాజీ సీఎం జగన్

అమరావతి,ఐఏషియ న్యూస్: మాజీ సీఎం జగన్ ఈ నెల 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. జగన్ యూరప్‌ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయ స్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. జగన్‌ ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రావటం లేదనే విషయాన్ని ప్రస్తావించింది.దీంతో, ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు. తన పైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తరువాత ఒక్క సారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. 2020 జనవరి 10న చివరి సారిగా కోర్టుకు హాజరయ్యారు. తిరిగి ఇప్పుడు జగన్ హాజరు కావడానికి వెళ్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *