ఎముక కాన్సర్‌ బాధితుడు పూర్వ విద్యార్థి యోగికి సహాయహస్తం

  • విరాళాలు సేకరించిన శ్రీ రాఘవేంద్ర స్కూల్
  • విద్యార్థి యోగి కుటుంబ సభ్యులకు లక్ష ఐదు వేల రూపాయలు అందజేత

గాజువాక,ఐఏషియ న్యూస్: గాజువాక శ్రీ రాఘవేంద్ర స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి యోగి ప్రస్తుతం ఎముక కాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు.యోగి చికిత్సకు మొత్తం 25 లక్షలు రూపాయలు అవసరమైన పరిస్థితిలో, ప్రభుత్వం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మిగతా వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం ముందుకువచ్చి సహాయం అందిస్తోంది. యోగి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే, శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరస్పాండెంట్ బండి శ్రీనివాసరావు , డి కృష్ణ కుమార్ , ప్రిన్సిపాల్ రమ్య, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి నిధుల సేకరణ చేపట్టారు. సహకరించిన 1,0,5,000 యోగి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి ఆరోగ్యం తమ బాధ్యతని. యోగి త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుంటున్నాం అన్నారు.అతని చికిత్సకు అవసరమైన మొత్తం అందించడానికి మేమందరం సహాయం కొనసాగిస్తున్నాం అని పేర్కొన్నారు.యోగి కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు,పూర్వ విద్యార్థులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Consul General D. C. Manjunath attended the BAANA Makar Sankranti Mela,organised by the Bhojpuri Awadhi Association of North America, in Frisco, Texas.

Consul General D. C. Manjunath attended the BAANA Makar Sankranti Mela, organised by the Bhojpuri …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *