టెక్స్ టైల్స్ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

  • సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు
  • కుదిరిన 7 ఎంవోయూలు 6,100 ఉద్యోగాల రాక
  • విశాఖపట్నం, చిత్తూరు,గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు
  • రూ.4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు
  • పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ సమ్మిట్ లో శనివారం మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్విస్టర్స్ ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో కృష్ణ జిల్లా మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలురానున్నాయి. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900ల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.

సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఏపీలో రూ. 4వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ప్రభుత్వంతో ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకువస్తోంది. మొత్తం ఏడు ఒప్పందాల ద్వారా ఏపీ టెక్స్ టైల్స్ రంగంలో రూ. రూ.4,380.38 కోట్ల మేర పెట్టుడులు తరలొచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 6,100 ఉద్యోగాలు రానున్నాయి.
టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత
విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Indian Diaspora Celebrates BJP’s Historic Victory in West Bengal, Assam, and Puducherry

Over 600 Indian Americans Gathered at Royal Albert Palace, Edison, NJ to Mark Defining Moment …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *