11 కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు నియామకం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 11కార్పోరేషన్ లకు ఛైర్మెన్ లను ప్రభుత్వం నియామకం చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా కల్యాణం శివ శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా సత్యనారాయణరాజు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ గా విక్రమ్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా మౌలానా షిబిలీ, ఫిషర్‌ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ గా రామ్ ప్రసాద్, పల్నాడు అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీ ఛైర్మన్‌ గా మధుబాబు, స్టేట్ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్‌ మెంట్ సొసైటీ ఛైర్మన్‌ గా శంకర్‌ రెడ్డి, కుర్ని, కరికాల భక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా మిన్నప్ప, షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌ మెంట్ సొసైటీ ఛైర్మన్‌ గా ముక్తియార్, భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా వెంకటేశ్వర రాజు, పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌ మెంట్ సొసైటీ ఛైర్మన్‌ గా వీరభద్రరావులను నియమించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పోరాడేవారంటే పాలకులకు భయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీనటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *