
తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం అండ
డల్లాస్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు ఎన్.ఆర్.ఐలనుద్దేశించి ప్రసంగించారు. కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో వేలాది మంది తెలుగు ప్రవాసుల సమక్షంలో లోకేష్ మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలబడిన తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రవాస భారతీయులను (ఎన్.ఆర్.ఐలను) ప్రశంసిస్తూ వారిని “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్” గా అభివర్ణించారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు అయినప్పుడు,అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో తమ నాయకుడికి మద్దతుగా ముందుకు వచ్చారని లోకేష్ గుర్తు చేసుకున్నారు.కూటమి సాధించిన చారిత్రక విజయాన్ని (175 స్థానాలకు గాను 164 సీట్లు) తెలుగు డయాస్పోరా మద్దతు వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.గత పాలనలో ‘వై నాట్ 175?’ అని అన్నప్పుడు, ప్రజలు ‘వై నాట్ 11?’ అని సమాధానం ఇచ్చి పూర్తి రాజకీయ మార్పును తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News