పెందుర్తిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: విశాఖపట్నం సిటీ, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ జె ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ హౌస్‌లో నివసించే తాడి సంధ్య (13) అనే బాలిక గత సెప్టెంబర్ 23న తన అత్త నరవ వెంకటలక్ష్మి ఇంటిలో ఉంటూ, సక్రమంగా ఇంటి పనులు చేసుకోవాలని ఆమె మందలించడంతో, అదే రోజు ఉదయం 10.00 నుండి 11.00 గంటల మధ్యలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్లి ఎక్కడికో వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి పరిసరాల్లో, బంధువుల ఇళ్లలో పరిశీలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. సంఘటన సమయంలో ఆమె తల్లి తాడి లక్ష్మి కూలి పనులకు బయటకు వెళ్లి ఉండడంతో ఈ విషయాన్ని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. అనంతరం,ఆమె తల్లి ఈనెల తొమ్మిదో తేదీన తన కుమార్తె అదృశ్యమైన సంఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఆమె చామన చాయిగా ఉండి, సుమారు 4½ అడుగుల ఎత్తు కలిగి, వైలెట్ రంగు టాప్ మరియు లంగా ధరించినట్లు తెలిపింది. ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిసిన పెందుర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్,దేవుడు నాయుడు 9959383806, పెందుర్తి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 9676797314కు తెలియజేయాలని పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *