కారును ఢీకొన్న ఆర్టీసీ బస్

ఆనందపురం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: ఆనందపురం మండలంలోని వేములవలస వద్ద కారును వెనక నుండి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అవ్వగా ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కలగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి కి చెందిన జి గోవింద్ తో పాటు మరో వ్యక్తి చీపురుపల్లి నుండి మధురవాడ వెళ్తుండగా హైవే నుండి వేముల వలస పెట్రోల్ బంక్ వైపు సర్వీస్ రోడ్లో వస్తుండగా అదే సమయంలో విజయనగరం నుండి పాత గాజువాక వెళ్తున్న గాజువాక డిపో ఆర్టీసీ బస్సు వెనక నుండి అతి వేగంగా వచ్చి కారు ను ఢీకొందని పోలీసులు వివరించారు.ఈ సంఘటనలో స్విఫ్ట్ డిజైర్ కారు నుజ్జు నుజ్జులయింది. అయితే కారులో ఉన్న వారికి బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణనష్టం జరక్కుండా బయటపడడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.కారు నడుపుతున్న జి గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ జి సంతోష్ కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం హెచ్ సి కృష్ణకు అప్పగించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *