అమరావతి,ఐఏషియ న్యూస్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల పరిధిలో 23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం 5 వేలకే ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఈ పథకానికి తొలి అడుగు సీఎం చంద్రబాబునాయుడు సొంతనియోజకవర్గమైన కుప్పంలో పడనుంది. అక్కడ మొదటి విడతగా ఈ-సైకిళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులకు ఈ విధానం ప్రత్యక్ష లాభం చేకూర్చేలాకార్యాచరణరూపొందించారు.అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు డిజైన్‌లు, అవసరాలకు అనుగుణంగా మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన వ్యయం తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యాలుగా పేర్కొంది.ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఈ-మొబిలిటీకి వేగం పెరుగుతుందని, సామాన్యుడి జీవనశైలిలో మార్పు వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News