విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపిడాక్టర్.శంఖబ్రత బాగ్చి రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా బుధవారం మహిళా పోలీసు స్టేషన్ ఆకస్మిక తనికి నిర్వహించారు. పోలీసు స్టేషన్ ను సందర్శించిన సిపి పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న సీపీ. స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సదరు ఇన్స్పెక్షన్ నందు డి.సి.పి-01 మణికంఠ చెందోలు తో పాటుగా మహిళా పోలీసు స్టేషన్ అధికారులు,సిబ్బంది హాజరు కావడం జరిగినది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News