కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖలో శనివారం జరిగిన శ్రామిక ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.చమట చుక్కకి ఓటమి లేదంటారు కానీ ప్రస్తుతం చమట చుక్కకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆరోపించారు.నిదానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రేవేటుపరం అవుతున్నాయని,ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని వ్యాఖ్యానించారు.ప్రజలు,కార్మికులు నిరంతరం పోరాటం చేయడమే మార్గం..ప్రశ్నించడమే దారి అని పిలుపునిచ్చారు.
ప్రశ్నించే గొంతుక నొక్కుతున్నారు.ప్రజలు రాజకీయం చేయాలి.పాలకులు పనిచేయాలి కానీ మన దగ్గర అది రివర్స్ అయింది.ఐ బొమ్మ రవి దొంగతనం చేశారు.దొంగతనం తప్పు.ధరలు పెరుగుతున్నాయంటే సినిమాలు చూడటం మానేయమన్నారు.జెనో ఫోభియాతో తీసే సినిమాల వెనుక విషం ఉంది.శ్రామిక ఉత్సవ్ ను ప్రజలు ఆదరించాలని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరు లేరని,ఆర్ఎస్ఎస్ దేశానికి పట్టిన విషం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్ఎస్ఎస్ లో ఒక్క మహిళ సభ్యురాలు లేరని ఎత్తిచూపారు.మావోయిస్టులను ఎంకౌంటర్లు చేయడం కాదు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రకాష్ రాజ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన

పూలమొక్కతో స్వాగతం పలికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శ్రీశైలం,ఐఏషియ న్యూస్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *