ముంబై,ఐఏషియ న్యూస్: ముంబై అండర్ వరల్డ్ డాన్, రాజకీయ నాయకుడిగా మారిన అరుణ్ గావ్లి 17 ఏళ్ల అనంతరం నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. 2007లో శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసండేకర్ హత్య కేసులో అతనికి జీవిత ఖైదు విధించారు.సుప్రీంకోర్టు అతనికి ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అతను బయటకు వచ్చిన వెంటనే,అతని కుటుంబం, మద్దతుదారులు అతనికి ఘన స్వాగతం పలికారు.
Authored by: Vaddadi udayakumar