ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం..ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులు విలీనం చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు పాటు గ్రామీణ బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం గురువారం ఒక పర్యటన జారీ చేశారు.ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు తీసుకురానున్నారు. విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది.
ఈ నెల 9న‌ సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు నిలిచిపోతాయి.ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు తమకు సహకరించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఇకపై ఆధార్‌ ఉంటేనే ట్రైన్ టికెట్‌

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *