కాకినాడ రూరల్,ఐఏషియ న్యూస్: కాకినాడ రమణయ్యపేటలో గల మూడవ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకోనునట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కృష్ణకుమార్ తెలిపారు.గురువారం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు స్కూలుకు కావలసిన కంప్యూటర్లు మౌలిక సదుపాయాలపై చర్చించారని ఉద్దేశంతో ఇప్పుడు 13 కంప్యూటర్లలో అందజేయడం జరిగిందని మరో 17 కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ముద్రగడ నాగేంద్రరావు మాట్లాడుతూ మేము చేసిన విజ్ఞప్తి మేరకు స్కూలుకు కంప్యూటర్ అందించినందుకు ఎస్బిఐను అభినందించారు.
అదేవిధంగా ఈ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా బ్యాంకు నుండి సహాయ సహకారాలు కావాలని కోరారు కావలసిన సదుపాయాలు పై కూడా వివరించారు పరిశీలించి తప్పనిసరిగా సదుపాయాలు కావలసిన సహకారాలు అందిస్తానన్నారు.అదేవిధంగా 10 మందివిద్యార్థులకు సైకిల్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ బ్యాండ్ ఎన్సిసి డ్రిల్ తో కమాండెంట్ రీజనల్ మేనేజర్ కృష్ణులకు ఘన స్వాగతం పలికి స్కూల్ విద్యార్థులు అందర్నీ ఆకర్షితులను చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ మన్మధరావు, చంద్రశేఖరరావు,డివివి ప్రసాద్, ప్రిన్సిపల్, హెడ్మాస్టర్, సిహెచ్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar