డల్లాస్,ఐఏషియ న్యూస్: మెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. డల్లాస్ లోని ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న విద్యార్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. విద్యార్థి పార్థీవదేహాన్ని …
Read More »admin
కొందరు ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి తీరు పైన మంత్రివర్గ భేటీలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేనని నిర్దేశించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. …
Read More »తెలంగాణ రాష్ట్రంలో 20వేల పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
తెలంగాణలో కొలువుల జాతక ప్రారంభం హైదరాబాద్,,ఐఏషియ న్యూస్: తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఇప్పటి కే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు వెలువడంతో మిగతా విభాగాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వం 60,000 పైగా నియామకాలు పూర్తిచేసింది. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఇక నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేసేందుకు కసరత్తు …
Read More »జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. Authored by: Vaddadi udayakumar
Read More »అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం
వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్(యుఎస్),ఐఏషియ న్యూస్: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు వరుడి తరఫు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుక చేశారు. డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దదిపశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా ఆయనది కమ్మ …
Read More »ఆధార్ అప్డేట్ రేట్లు పెరిగాయి: అమల్లోకి కొత్త ధరలు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆధార్ సేవల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆధార్ అప్డేట్ కోసం యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆధార్ అప్డేట్ కోసం కొత్త ఫీజులను ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది.ఛార్జీలను పెంచింది. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఇప్పటికే ఖరారు చేసింది.దీంతో, కొత్త ధరల మేరకు ఆధార్ అప్డేట్.. సేవలు కొనసాగుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు …
Read More »పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక మృతి
అనంతగిరి,ఐఏషియ న్యూస్: పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక చనిపోయిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు. ప్రకారం.మండలంలోని మంగళవారం చెరుకుమడత పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడింది.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్నాయిని కీర్తి(16) పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.కీర్తి మృతితోచెరుకుమడతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వ అధికారులేగుర్తించిబాలికనుకోల్పోయినతల్లిదండ్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీ విద్యార్థుల కోసం 40 లక్షల నోటుబుక్స్,పెన్నులు
విరాళం ఇచ్చిన కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌కు చెందిన కంపెనీ భారీ విరాళం ఇచ్చింది. ఏపీ విద్యార్థులకు అమలవుతున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి.. కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళం ఇచ్చింది. దాదాపు రూ.40 లక్షల రూపాయల విలువైన లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వీటిని పంచుతారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఈ పుస్తకాలు, పెన్‌లు ఉన్న ట్రక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ …
Read More »డీఎస్సీ కి ఎంపికయిన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీహరి
గుడివాడ,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకి చెందిన బంకురు శ్రీహరి గత 5ఏళ్ళుగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పట్టుదలతో చదువుకుని ఒక వైపు విధులు నిర్వహిస్తూ మరొక వైపు డీఎస్సీ కోసం కస్టపడి చదివి వచ్చిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఎస్ జి టి పోస్ట్ కు అర్హత సాధించటం జరిగింది. దీనిపై పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు..మరియు గుడివాడ తాలూకా ఎస్ఐ నంబూరి చంటి …
Read More »బీహార్‌లో తుది ఓటరు జాబితా విడుదల
పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్‌లో అనేక వివాదాలకు నెలవుగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్టు తెలిపింది. బీహార్‌లో ప్రధాన ఎన్నికల అధికారి తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్? బీహార్ ఓటరు తుది జాబితా ప్రకటించడంతో వచ్చేవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. …
Read More »