Business

జిఎస్టి లో రెండు స్లాబ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ …

Read More »

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్ట్

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతదేశంలోని అగ్రశ్రేణి అల్యూమినియం తయారీదారు హిందాల్కో ఇండస్ట్రీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఒక భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రెడీ అయింది. సంస్థ సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సౌకర్యం ను ఏర్పాటు చేయనుంది.ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు …

Read More »

భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం శుభవార్త

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. …

Read More »

ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Authored by: Vaddadi udayakumar

Read More »

మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »

టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాఖీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్దఎత్తున వినియోగించుకున్నారు.6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.ఈ నెల 9న రాఖీ పండుగ నాడు 45.62 ల‌క్షల మంది మహిళలు ప్రయాణించారు.11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి.గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది రాకపోకలు సాగించారు.ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సందర్భం బట్టి భారీగా వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఏది …

Read More »

బ్యాంకు కనీస నిల్వ పెంపు నిబంధన వెనక్కి తీసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రముఖప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు. ఇటీవల బ్యాంక్ ఖాతాలో రూ.50వేల కనీసం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను వెనక్కి తీసుకుంది. ఈ కనీస నిల్వ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బ్యాంక్ తన నిర్ణయం మార్చుకుంది. ఈ మేరకు కనీస సగట బ్యాలెన్స్ మొత్తాలను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది. మెట్రో/ అర్బ ఖాతాదారులు రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ కలిగి ఉండాలని, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7,500 ఉండాలన్న నిబంధన విధించింది. అలాగే గ్రామీణ ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలానే …

Read More »

సెప్టెంబర్ 1 నుంచి హాల్మార్క్ తో వెండి ఆభరణాలు అందుబాటులోకి

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: వెండి నగలు కొంటున్నారా అయితే ఈ కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి 900, 800, 835, 925, 970, 990 స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు. హాల్మార్కింగ్ …

Read More »

అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందజేత

అమరావతి,ఐఏషియ న్యూస్: నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, టిడిపి నేతలు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »