Business

విజయవాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ: 25వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈనెల 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లుతమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్తపథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు …

Read More »

నాన్ స్టాప్ బస్సులకు తగ్గిన ఆదాయం: సర్వీసులు తగ్గిస్తున్న ఆర్టీసీ అధికారులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ తీరుతో ఏపీ వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడుతుంది. స్త్రీశక్తి పథకంతో నాన్ స్టాప్ బస్సులకు దెబ్బ నాన్ స్టాప్ …

Read More »

రెండుకోట్ల విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నగరంలో రద్దయిన పెద్ద నోట్లు భారీమొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి ఎక్కడికి తీసుకు …

Read More »

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా …

Read More »

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి త్వరలో ప్రారంభోత్సవం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని వియ్యం ఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కైలాసగిరి మీద ఇటీవల సుమారు 5.50 కోట్ల రూపాయల ఖర్చుతో త్రిశూలం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా సుమారు 7 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ తో విశాఖకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ …

Read More »

జిఎస్టి లో రెండు స్లాబ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ …

Read More »

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్ట్

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతదేశంలోని అగ్రశ్రేణి అల్యూమినియం తయారీదారు హిందాల్కో ఇండస్ట్రీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఒక భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రెడీ అయింది. సంస్థ సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సౌకర్యం ను ఏర్పాటు చేయనుంది.ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు …

Read More »

భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం శుభవార్త

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. …

Read More »

ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Authored by: Vaddadi udayakumar

Read More »

మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …

Read More »