బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Authored by: Vaddadi udayakumar
Read More »Business
మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …
Read More »బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …
Read More »టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాఖీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్దఎత్తున వినియోగించుకున్నారు.6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.ఈ నెల 9న రాఖీ పండుగ నాడు 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించారు.11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి.గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది రాకపోకలు సాగించారు.ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సందర్భం బట్టి భారీగా వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఏది …
Read More »బ్యాంకు కనీస నిల్వ పెంపు నిబంధన వెనక్కి తీసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రముఖప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు. ఇటీవల బ్యాంక్ ఖాతాలో రూ.50వేల కనీసం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను వెనక్కి తీసుకుంది. ఈ కనీస నిల్వ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బ్యాంక్ తన నిర్ణయం మార్చుకుంది. ఈ మేరకు కనీస సగట బ్యాలెన్స్ మొత్తాలను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది. మెట్రో/ అర్బ ఖాతాదారులు రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ కలిగి ఉండాలని, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7,500 ఉండాలన్న నిబంధన విధించింది. అలాగే గ్రామీణ ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలానే …
Read More »సెప్టెంబర్ 1 నుంచి హాల్మార్క్ తో వెండి ఆభరణాలు అందుబాటులోకి
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: వెండి నగలు కొంటున్నారా అయితే ఈ కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి 900, 800, 835, 925, 970, 990 స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు. హాల్మార్కింగ్ …
Read More »అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందజేత
అమరావతి,ఐఏషియ న్యూస్: నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, టిడిపి నేతలు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై కన్నేసిన ట్రంప్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ గత దశాబ్ద కాలంగా భారత్ ను అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో ఏడు ప్రాజెక్టుల ద్వారా కనీసం గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలను ఆర్జించింది.ఈ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటోంది ట్రంప్ ఆర్గనైజేషన్.2024 నవంబర్ 5న ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే- తన భారత వ్యాపార భాగస్వామి ట్రైబెకా డెవలపర్‌తో …
Read More »ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చేసింది.ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని …
Read More »సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్
ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్,ఐఏషియా న్యూస్: పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు …
Read More »
News Website (iasianews.net) I Asia News