న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్‌సీఎల్) అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్, సరికొత్త ‘సేవింగ్స్ ప్రో’ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ఖాతాల్లోని అదనపు నిధులపై వినియోగదారులకు 6.5 శాతం వరకు వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో రూ.5000 నుంచి కనీస మొత్తాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొత్తానికి అదనంగా ఉండే సొమ్మును ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెడతారు. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు రోజుకు రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో …
Read More »Business
శ్రీదుర్గ మాంబ దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం నూతనకార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నేడు, రేపు దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం సబ్ రిజిస్ట్రార్ కు లేఖ అందజేసిన దస్తావేజులేఖరులు సబ్బవరం,ఐఏషియ న్యూస్: శ్రీదుర్గమాంబ దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం సమావేశం గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం దస్తావేజు లేఖర్ల తరపు నుండి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సంఘం గౌరవ అధ్యక్షులుగా బిక్కవల్లి రామ్మూర్తి (రాంబాబు),అధ్యక్షులుగా వల్లభ జోస్యల సీతారామమూర్తి,ఉపాధ్యక్షులుగా జూరెడ్డి శ్రీరామమూర్తి,ప్రధాన కార్యదర్శిగా శేఖర మంత్రి శ్రీనివాసరావు పట్నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దంతులూరి సురేష్ వర్మ,జాయింట్ సెక్రెటరీగా నరవ రామచంద్ర …
Read More »జిఎస్టి 2.0 సంస్కరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం
అమరావతి,ఐఏషియ న్యూస్: కేంద్రం తాజాగా జీఎస్టీ స్లాబ్ రేట్లలో చేసిన మార్పుల్ని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జీఎస్టీ-2.0 సంస్కరణల్ని స్వాగతిస్తూ దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు, దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణలు తెచ్చిన ప్రధానికి ఏపీ అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. జీఎస్టీ-2.0 రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ …
Read More »కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘనస్వాగతం
విశాఖపట్నం, ,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,మాజీ రాజ్యసభ …
Read More »నేడు లండన్ లో మంత్రి నారా లోకేష్ రోడ్ షో
నవంబర్ లో పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతమే లక్ష్యం అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపి ప్రభుత్వం విశాఖలో నవంబర్ 14 15తేదీలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రి లండన్ లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా రాత్రి 7గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30గంటలకు) నిర్వహించే ఈ రోడ్ …
Read More »కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన పులిమచ్చల చేప
అంతర్వేది,ఐఏషియ న్యూస్: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకుచేప చిక్కింది.10-12 కిలోల బరువున్న ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. సాధారణంగా అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు,గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని వైద్యులు తెలిపారు. Authored by: Vaddadi udayakumar
Read More »రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మ్యాంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 …
Read More »కాకినాడ ఎంపీకి సైబర్ షాక్
వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు కాకినాడ,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 …
Read More »నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ చైర్మన్ గా తెలుగుతేజం ఇంజేటి శ్రీనివాస్ నియామకం
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) మాజీ వ్యవస్థాపక చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈకి సారథి లేరు. తొలి పబ్లిక్ ఇష్యూకి (ఐపీఓ) ఎక్స్ఛేంజీ సిద్ధం అవుతున్న సమయంలో తెలుగు మూలాలున్న శ్రీనివాస్ నియామకం జరిగింది. ఆయన ఇటీవల ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో …
Read More »20ఏళ్లు పూర్తి చేసుకున్న టీవీఎస్ అపాచీ
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్ కంపెనీ పోర్టుఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన “అపాచీ మోటార్‌సైకిల్” మార్కెట్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో మంగళవారం కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ అపాచీ ఆర్‌టీఆర్ శ్రేణి మోటార్ సైకిళ్లను విడుదల చేశారు. 2005లో అపాచీ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాధాకృష్ణన్ తెలిపారు. దాదాపు 80కి పైగా దేశాల్లో 65 లక్షల మంది వినియోగదారులకు అపాచీ అత్యంత …
Read More »
News Website (iasianews.net) I Asia News