హైదరాబాద్,ఐఏషియ న్యూస్: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 82 ఏళ్ల వ్యక్తికి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది.నిందితులు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని, మనీలాండరింగ్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందని వయోధికుడిని బెదిరించారు. పదిరోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశామని బాధితుడిని వేధించి రూ.72 లక్షలు వసూలు చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి కాల్స్ ఎవరు …
Read More »crime
విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం: ప్రయాణికులు సురక్షితం
విశాఖపట్నం ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.ఈ పరిణామాల మధ్య విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మెట్రో బస్సు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు …
Read More »లంచం తీసుకున్న ఎస్ఐ కి ఏడేళ్ల జైలుశిక్ష,2.5 లక్షల జరిమానా
ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకటన లీగల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. వివరాల్లోకెళ్తే విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు,అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్ ఐ గా పనిచేస్తున్న సమయంలో సదరు మహిళ …
Read More »అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం
శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లోని కీలక శాఖలు, వెబ్‌సైట్‌లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలో పెన్‌డ్రైవ్‌లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ …
Read More »ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు
తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు అమరావతి,ఐఏషియ న్యూస్: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని,నిందితుల పేర్లతో …
Read More »దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్
అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, …
Read More »లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడ్డ సింగరాయి సచివాలయం వీఆర్వో సత్యవతి
వేపాడ (విజయనగరం),ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లా, వేపాడ మండలం, సింగరాయి గ్రామానికి చెందిన గేదల భాస్కరరావు తాత పేరిట సింగరాయి, గుడివాడ గ్రామాలలో 6 ఎకరాల వ్యవసాయ భూమి వున్నది.అయితే ఆ భూమిని గేదల భాస్కరరావు తండ్రి పేరిట,అతని బాబాయి పేరిట 1బి అడంగల్ లో మ్యుటేషన్ చేసి, వారివురి పేరున పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వీఆర్వో సచ్చిపోతే సంప్రదించారు. ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వడానికి సింగరాయి గ్రామ సచివాలయం రెవిన్యూ అధికారి శ్రీమతి కోతన సత్యవతి సదరు …
Read More »ఆరవసారి “రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం” సాధించిన తెలుగుబిడ్డ సందీప్ చక్రవర్తి
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ జీ.వి. సందీప్ చక్రవర్తి. ఆరోసారి రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం (పిఎంజి) అందుకుని అరుదైన ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధికసార్లు ఈ పతకం పొందిన కొద్దిమంది అగ్ర ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరిగా నిలిచారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, విశేషాలు.. …
Read More »వాడపల్లిలో (దేశ)భక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు
(వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఈ తరం వారికి తెలియని ఇంకో ముఖ్యమైన చరిత్ర ఇక్కడ దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ దైవ భక్తులతో పాటు దేశ భక్తులు పుష్కలంగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన రోజులవి.ఈ ఊరు చిన్నదైనా అక్కడ నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాల్ని నాటారు. రక్తాన్ని ధారపోశారు. ఈ త్యాగాలు ఆ పల్లె కోసం …
Read More »