ఆనందపురం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: ఆనందపురం మండలంలోని వేములవలస వద్ద కారును వెనక నుండి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అవ్వగా ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కలగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి కి చెందిన జి గోవింద్ తో పాటు మరో వ్యక్తి చీపురుపల్లి నుండి మధురవాడ వెళ్తుండగా హైవే నుండి వేముల వలస పెట్రోల్ బంక్ వైపు సర్వీస్ రోడ్లో వస్తుండగా అదే సమయంలో విజయనగరం నుండి పాత గాజువాక వెళ్తున్న గాజువాక డిపో ఆర్టీసీ బస్సు వెనక …
Read More »crime
20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునిపై నమోదైన పిడిఎస్ రైస్ కేసును తొలగించడానికి, అలాగే అతనికి విధించిన జరిమానా ప్రక్రియలు పూర్తి చేసి రేషన్ షాప్‌ను తిరిగి తెరవడంలో సహాయం చేస్తానని చెబుతూ 20వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసిన హనుమ రవీందర్ నాయక్, ఈ సందర్భంగా ప్రియదర్ నుండి నగదు తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి పట్టుబడి అరెస్టయ్యారు.నిందితుడిని ఏసీబీ కోర్టుకు తరలించారు. …
Read More »మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ముమ్మిడివరం,ఐఏషియ న్యూస్: ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి. టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమిల్లి అర్చనా దేవి ఈనెల 3వ తేదీన హాస్టల్‌కు వెళ్లి.. అక్కడి …
Read More »ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె. సాయిదీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. …
Read More »ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. రాష్ట్రకేడర్ కు కేటాయించినవారిలో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కె.ఆదిత్యశర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరిఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హరియాణా), ప్రియ (దిల్లీ), సుయష్ కుమార్ (ఉత్త రప్రదేశ్)లు ఉన్నారు.ఏపీ స్వరాష్ట్రంగా ఉన్న చెన్నంరెడ్డి …
Read More »గోవాలో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. 23 మంది మృతి
గోవా,ఐఏషియ న్యూస్: గోవాలోని అర్పోరాలో ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది కిచెన్ సిబ్బంది ఉండగా.. పలువురు పర్యాటకులు కూడా ఉన్నారని అధికారు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Authored by: Vaddadi udayakumar
Read More »మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
మాడుగుల,ఐఏషియ న్యూస్: మాడుగుల మండలంలో శుక్రవారం సాయింత్రం 4 గంటల సమయంలో జమాదేవిపేట గ్రామానికి చెందిన మట్ట బాలు(19) అనే యువకుడు గత సంవత్సరం ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం చదవకుండా ఊర్లో ఖాళీగా తిరుగుతూ ఉండడం వల్ల అతని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపం చెంది అదే గ్రామంలో నివాసం ఉంటున్న అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్టు మృతుని తల్లి అయిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మాడుగుల ఎస్ ఐ నారాయణరావు …
Read More »ఉన్నత చదువుల కోసం వెళ్లి అనంత లోకాలకు
బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి అలబామా(అమెరికా),ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్న పది మంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు.అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు, కేకలు వేశారు.లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …
Read More »ఏసీబీ వలలో ఏపీ సీపీడీసీయల్ ఏఈ పెద్దమస్తాన్
కారంపూడి,ఐఏషియ న్యూస్: కారంపూడి షేక్ మస్తాన్ వలి కారంపూడి చిన్న వ్యాపారం నిమిత్తం షాపు నడుపుతున్నాడు.విద్యుత్ ఏఈ పెద్దకోట మస్తాన్, బాధితుడు షేక్ మస్తాన్ జానీ అనే వ్యక్తిని ఎలక్ట్రికల్ సర్వీస్ మీటర్ కనెక్షన్ ఇచ్చేటందుకు బాధితుడు వద్ద నుండి 25రూ వేల లంచం డిమాండ్ చేశారు.ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు షేక్ మస్తాన్ జానీ. ఈ నేపద్యంలో గురువారం విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మతే మాట్లాడుతూ ఏ ఈ …
Read More »విశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన పోలీసులకు హోంమంత్రి అభినందనలు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. జాతీయ వార్షిక నివేదిక- 2025లో విశాఖ చోటు దక్కించుకున్న సందర్భంగా ఆర్కే బీచ్ ఐ ఎన్ ఎస్ కురుసురా నుంచి ఏయూ కన్వెన్షన్ వరకు జరిగిన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏయూ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వేడుకలో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన పోలీసులకు9 అభినందనలు. శక్తి టీమ్స్, శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం …
Read More »
News Website (iasianews.net) I Asia News