విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలో గల ఎంవీపీలో చోటు చేసుకుంది. ఈజీమనీ కోసం కొంతమంది కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దొంగనోట్లు ముద్రించి ప్రజల్లో చలామణికి పాల్పడుతున్నారు. . దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఓ వ్యక్తి తన ఇంట్లోనే దొంగనోట్లు తయారు …
Read More »crime
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం చంద్రబాబు
మంగళగిరి,ఐఏషియ న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు: సీఎం చంద్రబాబు ప్రకటన
మంగళగిరి,ఐఏషియ న్యూస్: సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు.ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను సిబ్బందిని సీఎం చంద్రబాబు అభినందించారు. Authored by: Vaddadi udayakumar
Read More »దేశంలోనే అత్యుత్తమ స్థానంలో తెలంగాణ పోలీస్ నిలవాలి
పోలీస్ అమరవీరుల దినోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర …
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కూతురు మృతి
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో విషాదఛాయలు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. అదే కుటుంబంలో మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో మంచిర్యాల లోని రెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కూతురి గృహ ప్రవేశానికి అమెరికా వెళ్లి అక్కడే తిరిగిరాని …
Read More »ఏపీ పోలీసులకు పౌరులను కొట్టడం అలవాటైంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు
పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం పౌరులను కొట్టడం అలవాటుగా మార్చుకున్నారని వ్యాఖ్య 2016 నాటి కేసులో 8 ఏళ్లయినా దర్యాప్తు పూర్తికాలేదని అసహనం కర్నూలు బాధితుడు ఇప్పటికీ నడవలేని దుస్థితి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో పోలీసుల వైఖరిపై ఏపీ హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధించడం,వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నిందితులపై హత్య కేసు లేదా దొంగతనం కేసు నమోదు చేసినా, చట్టప్రకారం నడుచుకోవాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే …
Read More »ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాజధాని దిల్లీ శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సుమారు 1:20 గంటల ప్రాంతంలో దిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. తక్షణమే స్పందించిన అధికారులు దాదాపు 14 …
Read More »లబ్బూరు జంక్షన్ వద్ద 45 కిలోల గంజాయి స్వాధీనం
ముంచంగిపుట్టు,ఐఏషియ న్యూస్: ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద 45కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ జె. రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. రెండు బైక్ ల పై గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైకులను సీజ్ చేసి ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
శబరిమల,ఐఏషియ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నేతృత్వంలో గురువారం ఉదయం నుండి కిలిమనూరు సమీపంలోని ఉన్నికృష్ణన్ నివాసంలో దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం,శుక్రవారం తెల్లవారుజామున అతని అరెస్టును …
Read More »దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై విశాఖ నగర పోలీసుల మెరుపు దాడులు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News