crime

కన్నీటి కరూర్‌ కార్నర్ సమావేశం

తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు హుటాహుటిన కరూర్‌ చేరుకున్న సీఎం స్టాలిన్‌.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… …

Read More »

రాయపూర్ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం: ఆరుగురు మృతి

రాయపూర్,ఐఏషియ న్యూస్:  ఛత్తీస్‌గఢ్‌లోని రాయపుర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.ఓ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలిసింది.గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికిచేరుకునిసహాయకచర్యలుచేపట్టారు.శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను రెస్యూటీం సహాయంతో బయటకు …

Read More »

నాడు “అనకాపల్లి ఏఎస్పి” నేడు “తెలంగాణ రాష్ట్ర డిజిపి” శివధర్ రెడ్డి

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి అంచలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇక శివధర్ రెడ్డి వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంతు లేకలాన్ (పెద్దతూండ్ల) గ్రామం.తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శివధర్రెడ్డి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో సాగింది. ఐపీఎస్ కావడానికి ముందు ఆయన ఓయూలో ఎల్ఎల్బీ చదివి కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. ఆ తర్వాత సివిల్స్ …

Read More »

ఏపీలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలి

నాగబాబు ప్రశ్నలకు హోం మంత్రి సమాధానం  అమరావతి,ఐఏషియ న్యూస్: మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు,మొదట్లో కొంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈరోజు ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ,వైఎస్సార్‌సీపీ సభ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న తర్వాత,2019-24 కాలంలో తప్పుడు అక్రమ క్రిమినల్ కేసుల పరిష్కారంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు కేసుల గురించి ఆయన గణాంకాలతో సహా సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు …

Read More »

విశాఖలో ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్‌కు విమానం బల్దేరింది. కొంత దూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. దీంతో ఇంజిన్‌ ఫ్యాన్‌ రెక్కలు దెబ్బతిన్నాయి. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్‌ చేశారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు.వీరి కోసం ఎయిరిండియా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »

విశాఖ రైల్వే స్టేషన్లో 95 వేలు విలువైన గంజాయి పట్టివేత

విశాఖ క్రైమ్ ,ఐఏషియ న్యూస్: విశాఖ రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖ జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో జి ఆర్ పి,ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి , జూలీ కర్మాకర్, వారి సిబ్బందితో కలిసి గురువారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా గంజాం జిల్లా, ఒడిస్సా రాష్ట్రం కు చెందిన మాలతి సాహు, (56) సుమిత సాహూ, …

Read More »

రెండు గంటల సమయంలోనే తప్పిపోయిన కొడుకుని తల్లి చెంతకు చేర్చిన వన్ టౌన్ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: తప్పిపోయిన బిడ్డ ఆచూకీ రెండు గంటల్లో కనుగొన్న వన్ టౌన్ పోలీసులు. ఈ సంఘటన నగరంలోని పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు ప్రాంతంలో జరిగింది. గురువారం 3 సంవత్సరాల వయసు గల రుత్విక్ రాజును వెంట తీసుకొని కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఇంతలో కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుడు తమ వెంట కనిపించకపోవడంతో రుత్విక్ తప్పి పోయాడని గ్రహించిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ. జీడి బాబుకు ఈ విషయం …

Read More »

జన్మభూమి ఎక్స్ ప్రెస్ నుంచి జారిపడి బిటెక్ విద్యార్థి దుర్మరణం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తుని రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఆదిత్య కళాశాల విద్యార్థి గరికిన హేమన్ రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన హేమన్ రాజు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారి పడడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన హేమన్ రాజును విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం …

Read More »

విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంచనా హైద‌రాబాద్,ఐఏషియ న్యూస్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు.మంగ‌ళ‌వారం తెల్ల‌వార‌జాము నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విరామం లేకుండా సోదాలు నిర్వ‌హించారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్క‌ర్ నివాసంతో పాటు ఆయ‌న కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగావిడిపోయిగచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో …

Read More »

కాకినాడ ఎంపీకి సైబర్ షాక్

వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు కాకినాడ,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 …

Read More »