
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలో గల ఎంవీపీలో చోటు చేసుకుంది. ఈజీమనీ కోసం కొంతమంది కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దొంగనోట్లు ముద్రించి ప్రజల్లో చలామణికి పాల్పడుతున్నారు. . దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఓ వ్యక్తి తన ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయగా దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్,ప్రింటింగ్ మిషనరీ, మెటీరియల్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఒకరి అరెస్టు,మరో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్,గాంధీ బొమ్మ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న మధ్యప్రదేశ్ కు చెందినశ్రీరామ్ ను అదుపులోకి తీసుకొని, దొంగనోట్ల తయారీ సంబంధించిన మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నా, రు. ఈకేసులో సంబంధించి ప్రధాన నిందితుడు ప్రసాద్ మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News