అనకాపల్లి క్రైమ్,చాన్విక జ్యోతిన్యూస్: అనకాపల్లి మండలం, అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యస్. శ్రీను తండ్రికి వారి గ్రామములో కొంత వ్యవసాయభూమి వున్నది. ఆయన ఇటీవల చనిపోయినారు. దానిమీదట సదరు శ్రీను ఆ భూమిని తన తల్లి పేరున రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి,ఆమె పేరున ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండల రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసినాడు. అయితే, ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, ఆమె పేరును రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండలం, మారేడుపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ రెవిన్యూ అధికారిగా పనిచేస్తున్న మాణిక్యం సూర్యనారాయణ, సదరు యస్. శ్రీను వద్దనుండి 50వేల రూపాయలులంచంగా డిమాండు చేసినారు. యస్. శ్రీను బ్రతిమిలాడగా చివరకు సదరు అధికారి రూ.20వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. అయితే యస్. శ్రీనుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక, సదరు గ్రామ రెవిన్యూ ఆధికారిపై ఎసిబి టోల్ ఫ్రీ నెంబరు 1064 కు ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదు మీదట విశాఖ ఎ.సి.బి అధికారులు కేసు నమోదు చేశారు. సదరు గ్రామ రెవిన్యూ అధికారి సూర్యనారాయణ ఆ లంచం డబ్బులను, ఫిర్యాదు దారుడి వద్దనుండి గురువారం తీసుకొంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు కాబడిన సదరు వీఆర్వో ను విశాఖపట్నంలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం హాజరు పరచనున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోఏదైనాఅవినీతిజరుగుచున్నట్లయితే, సదరు సమాచారాన్ని ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్ నెం. 94404 40057 కు కాని లేదా ఎ.సి.బి. ఈ-మెయిల్ ఐ.డి. నెం. complaints-acb@ap.gov.in కు కానీ తెలియజేయాలని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News