హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్లోముగ్గురుడ్రగ్,పెడ్లర్లు,ఒకవినియోగదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టైన వారిలో ఒక మహిళా టెక్కీ ఉండటం సంచలనంగా మారింది. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందినవారిగా గుర్తించారు.పోలీసులు వారి వద్ద నుంచి హైడ్రోపోనిక్ గంజాయి 22 గ్రాములు, ఎండిఎంఏ 5 గ్రాములు, ఎక్స్టసీ మాత్రలు 5.57 గ్రాములు, ఎల్ఎస్ఈ బ్లాట్స్ 6, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా …
Read More »crime
రోడ్డుపక్కన వానరాల కళేబరాలు: కడప జిల్లాలో దారుణం
కడప,ఐఏషియ న్యూస్: కడప జిల్లాలో దారుణం జరిగింది. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో మంగళవారం సాయంత్రం వానరాలను చంపి, వాహనంలో తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లడం కలకలం రేపింది. పశువులను మేపడానికి వెళ్లిన కాపర్లు రోడ్డు పక్కన 21 వానరాలు చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. కప్పలపల్లి …
Read More »30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్.
నంద్యాల,ఐఏషియ న్యూస్: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారిగా శ్యామ్ రాజు ఏడాది జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి ఖజానా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45వేలు రూపాయలు డిమాండ్ చేయగా 30వేలు రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. శ్యామ్ రాజు ఫిర్యాదిదారుడు మేరకు ఏసీబీ …
Read More »సైబర్ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ.. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు పోగొట్టుకున్న అమర్ సింగ్ చాహల్ 12 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పాటియాలా,ఐఏషియ న్యూస్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ కన్నుమూశారు. భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన తీవ్ర మనస్తాపంతో సోమవారం తననివాసంలోతుపాకీతోకాల్చుకున్నారు. డైలి జాగరణ్ కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ …
Read More »పూర్ణమార్కెట్ లో అగ్నిప్రమాదం: పలు పూజ సామాగ్రి దుకాణాలు దగ్ధం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ ఉన్న ఆరు పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆస్తినష్టం ఎంత జరిగిందన్నది తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »ఏసీపీతో సహా సీఐ,ఎస్ఐలు సస్పెన్షన్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి,ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు సోమవారం జారీచేశారు.వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ డీజిపి శివధర్ రెడ్డి …
Read More »లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈఈ సత్యమూర్తి
రాయచోటి,ఐఏషియ న్యూస్: రాయచోటి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్పీయం సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి.గాలివీడు మండలానికి చెందిన ఓ రైతు నుంచి15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గాలివీడు ఏఈఈ సత్యమూర్తి. లంచం తీసుకున్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యమూర్తి ఏసీబీ కోర్టు తరలించారు. Authored by: Vaddadi udayakumar
Read More »లంచం తీసుకుంటూ దొరికిన డిడి,సీనియర్ అసిస్టెంట్, రిటైర్డ్ ఉద్యోగి
కాకినాడ,ఐఏషియ న్యూస్: కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు.కారుణ్య నియామకం,పెన్షన్ సెటిల్‌మెంట్ పనుల నిమిత్తం 40 వేల లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారెపు సూర్య శివప్రసాద్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన గెద్దాడ చక్రవర్తి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.లంచం వ్యవహారంలో మాజీ ఉద్యోగి యాదల సత్యనారాయణను మధ్యవర్తిగా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడు చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు …
Read More »డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు.మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ కాగా మిగతా …
Read More »సింహాచలం సమీపంలో ఘోర ప్రమాదం ఒకరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం
సింహాచలం ,ఐఏషియ న్యూస్: సింహాచలం గోశాల సమీపం లోని వాసుదేవ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రాతి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతుడి భార్య,ఆరుఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News