crime

నేరాల గురించి ఏపిపిఐసిలో గల అమెజాన్ కంపెనీ సిబ్బందికి అవగాహన సదస్సు

పెందుర్తి,ఐఏషియ న్యూస్: పెందుర్తి ఏరియా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, గొలుసు దొంగతనాలు , మోటార్ సైకిల్ లు దొంగతనాలు, దేవాలయాలలో దొంగతనాలు గురించి సీసీ కేమేరాస్ , వీధిదీపాలు ఏర్పాటు గురించి ప్రజలలో అవగాహన కల్పించామని విశాఖ సిటీ పోలీస్ కమీషనర్, డా. శంకభ్రత భాగ్చి ఆదేశాల మేరకు, డిసిపి క్రైమ్ శ్రీమతి కె.లతా మాధురి. ఉత్తర్వులు ప్రకారం వెస్ట్ సబ్-డివిజన్ క్రైమ్ సిఐ,ఎం చంద్ర మౌళి అధ్వర్యంలో పెందుర్తి క్రైమ్ ఎస్ ఐ,సూరిబాబు వారి సిబ్బందితో కలసి పెందుర్తి ఏరియాలో గుర్రంపాలెం ఏ …

Read More »

మూడు కేజీల యాష్ ఆయిల్ పట్టివేత: ఎస్ఐ వెంకటేశ్వరరావు

చింతపల్లి,ఐఏషియ న్యూస్: వాహనాల తనిఖీలలో భాగంగా పోలీస్ సిబ్బంది యాష్ ఆయిల్ తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఖచ్చితమైన సమాచార మేరకు వాహనాల తనిఖీలలో భాగంగా మూడు కేజీల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా, ఈ కుట్రలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అదుపులోకి తీసుకున్న వాళ్లపైకేసునమోదుచేసుకొనిదర్యాప్తుకొనసాగించబడుతున్నట్లు ఆయన తెలిపారు.అనుమానిత వ్యక్తులు సమీపంలో గుర్తించిన్నట్లయితే …

Read More »

తమ “కుటుంబానికి” ఇప్పటికీ “ప్రాణహాని” ఉంది

కుప్పం,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి …

Read More »

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి

వనపర్తి,ఐఏషియ న్యూస్: వనపర్తి సర్కిల్ అండ్ డివిజన్‌లోని గోపాల్‌పేట్ సెక్షన్‌లోని టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి, ఫిర్యాదుదారుడి బంధువు వ్యవసాయ పొలాలలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి చెల్లింపులో భాగంగా ఫిర్యాదుదారుడి నుండి రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి రూ.20వేలు బుధవారం లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎసిబి కోర్టుకు తరలించారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు అవినీతి నిరోధక బ్యూరో …

Read More »

ఏలూరులో పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

ఏలూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డు సమీపంలో, పెద్దగా జన సంచారం లేని అపార్ట్మెంట్ల సముదాయాల చివరలో ఆ ప్రాంతానికి చెందిన …

Read More »

లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ మండల సర్వేయర్

సికింద్రాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న కిరణ్ మంగళవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్ కుమార్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకుఆయన రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్ మాన్ ద్వారా లక్ష రూపాయలు లంచం …

Read More »

30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా

ఇల్లందు,ఐఏషియ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాపులో స్టాక్ లేనందుకు,పనివేళ్లలో రేషన్ షాపు మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గానూ రేషన్ షాపు యజమాని వద్ద 30 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా.డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను సోమవారం లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిందితులను అదుపులోనికి తీసుకొని …

Read More »

మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో ఫేక్ టీటీడీ దర్శన లెటర్లు

విజయవాడ,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకీలీ టీటీడీ దర్శన లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీఏ సోమవారం విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిటిడి కి జారీ చేస్తున్న ఇటువంటి నకిలీ లెటర్లు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. Authored by: Vaddadi …

Read More »

సౌదీ అరేబియాలో బస్సు దగ్ధం: 42 మంది దుర్మరణం

ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం సౌదీ అరేబియా,ఐఏషియ ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) కాగా.. ఇతను …

Read More »

తుక్కు దుకాణంలో వ్యర్థ రసాయనాలు అగ్నికి ఆహుతి

పరవాడ,ఐఏషియ న్యూస్: తుక్కు దుకాణంలో ఫార్మా వ్యర్ద రసాయనాలు భగ్గు మన్నాయి. పరవాడ ఫార్మాసిటీ పరిసరాలలో తుక్కు దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. అటు అనకాపల్లి పిసిబి అధికారులు, ఇటు పరవాడ పోలీస్ అధికారుల సహకారంతో ఫార్మా వ్యర్థ రసాయనాలు కంటైనర్ లను తుక్కు దుకాణాల ముసుగులో నిల్వ ఉంచుతున్నారు. వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకి కొంతమేర వ్యాపించడంతో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. తుక్కు దుకాణాల సమీపంలో నిప్పు పుడితే పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పరవాడ మండల పరిధిలో ఎంఎస్ ఎంఈ పార్కులో గతంలో …

Read More »