వనపర్తి,ఐఏషియ న్యూస్: వనపర్తి సర్కిల్ అండ్ డివిజన్‌లోని గోపాల్‌పేట్ సెక్షన్‌లోని టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి, ఫిర్యాదుదారుడి బంధువు వ్యవసాయ పొలాలలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి చెల్లింపులో భాగంగా ఫిర్యాదుదారుడి నుండి రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి రూ.20వేలు బుధవారం లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎసిబి కోర్టుకు తరలించారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు అవినీతి నిరోధక బ్యూరో తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ప్రజలను వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసిబి), వెబ్‌సైట్: (acb.telangana.gov.in) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారు / బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఎసిబి అధికారులు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News