empolyment

ప్రఖ్యాత కంపెనీ “ఎయిర్ బస్” కోసం ఏపీ ముందడుగు

రాష్ట్రంలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ కీలక భేటీ న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో సమావేశం రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన మంత్రి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం “ఎయిర్ బస్” పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో మంగళవారం …

Read More »

డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్ ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం ఈ యాప్ వినియోగం వల్ల మహిళలకు బ్యాంకర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో పనిలేదు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది. “మన డబ్బులు-మన లెక్కలు” అనే ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ఇప్పటికే 260 చోట్ల పైలట్ …

Read More »

రాయపూర్ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం: ఆరుగురు మృతి

రాయపూర్,ఐఏషియ న్యూస్:  ఛత్తీస్‌గఢ్‌లోని రాయపుర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.ఓ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలిసింది.గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికిచేరుకునిసహాయకచర్యలుచేపట్టారు.శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను రెస్యూటీం సహాయంతో బయటకు …

Read More »

టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక

ములుగు,ఐఏషియ న్యూస్:  పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

అంగన్వాడి,ఆశ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు: ప్రభుత్వం నిర్ణయం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు.ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.కాగా ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో తల్లికి …

Read More »

ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పనిగంటలు పెంపునకు ప్రభుత్వ ఆమోదం

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పని గంటల పెంపునకు ఆమోదం లభించింది. ప్రస్తుతం 8 పని గంటల విధానం ఇక నుంచి మరో రెండు గంటల వరకు పెరగనుంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. పనిగంటల పెంపు సమయంలో పలు నిబంధనలను స్పష్టం చేసారు. దీని ద్వారా రాష్ట్రంలోని దుకాణాలు.. సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఇక పని గంటలు పెరగనున్నాయి.ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్‌ సవరణ బిల్లు-2025 …

Read More »

ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగి ఉన్న వారికి శ్వేతసౌధం తీపికబురు

వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్:  కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము ఉంటుందన్న శ్వేత సౌధం ప్రకటించింది.కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్లు రుసుము ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.కొత్త వీసాదారులకే రుసుము ఉంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు.ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదని పేర్కొన్నారు.విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన అవసరం లేదన్నారు.హెచ్1బీ వీసాల్లో దాదాపు …

Read More »

గీతం ఎమ్‌సిఎ విద్యా ర్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం లోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్‌.లహరి మోహన్‌, ఎమ్‌.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్‌.మనోజ్‌ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్‌ సంస్థకు ఎంపికయ్యారు గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వ హిస్తున్న కెరీర్‌ …

Read More »

ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త

దసరా నుంచి ఖాతాలో డిబిటి ద్వారా నేరుగా 15వేలు జమ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాహనమిత్ర అమలు పైన ప్రకటన చేసారు. దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరు ఖాతాలో రూ 15 వేలు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారులు.. ఖర్చు.. నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన …

Read More »

ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయి చెల్లింపునకు 1,668 కోట్లు విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో మే 15వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు చెల్లించవలసిన వేతన బకాయిల సొమ్మును కేంద్రం విడుదల చేసింది. మొత్తం 1,668 కోట్ల రూపాయలను కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది. ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.ఏపీలోని ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. త్వరలో మరో …

Read More »